Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సౌత్ సినిమాలు చేసే ఛాన్సే లేదు... జాన్వి కపూర్

ప్రస్తుతానికి తన దృష్టినంతా బాలీవుడ్ చిత్రాలపైనే కేంద్రీకరించినట్టు అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ స్పష్టంచేసింది. అదేసమయంలో సౌత్ సినిమాల్లో చేసే ఛాన్సే లేదని ఆమె వెల్లడించారు.

Advertiesment
సౌత్ సినిమాలు చేసే ఛాన్సే లేదు... జాన్వి కపూర్
, బుధవారం, 3 అక్టోబరు 2018 (21:02 IST)
ప్రస్తుతానికి తన దృష్టినంతా బాలీవుడ్ చిత్రాలపైనే కేంద్రీకరించినట్టు అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ స్పష్టంచేసింది. అదేసమయంలో సౌత్ సినిమాల్లో చేసే ఛాన్సే లేదని ఆమె వెల్లడించారు.
 
శ్రీదేవి న‌ట వార‌సురాలిగా జాన్వి కపూర్‌ బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన 'ధ‌డ‌క్' సినిమాతో జాన్వి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమాతోనే న‌టిగా జాన్వి మంచి మార్కులు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ నిర్మాణంలోనే 'త‌ఖ్త్' సినిమాలో న‌టిస్తోంది.
 
మ‌రోవైపు సౌత్ సినిమాల‌పై కూడా జాన్వి దృష్టి పెట్టిందని వార్త‌లు వ‌స్తున్నాయి. తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అలాగే త‌మిళంలోనూ ఒక సినిమాకు ఓకే చెప్పిన‌ట్టు గాసిప్‌లు వ‌చ్చాయి. వీటి గురించి తాజాగా జాన్వి మాట్లాడింది.
 
'ధ‌డ‌క్' సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ప్ర‌స్తుతానికి బాలీవుడ్‌లోనే మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. బాలీవుడ్‌లో న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న త‌ర్వాతే ద‌క్షిణాది సినిమాల‌పై దృష్టి పెడ‌తాను. ఇప్ప‌ట్లో సౌత్ సినిమాలు చేసే ఆలోచ‌న లేదని ఆమె చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.7 కోట్ల ప్రశ్న.. గుడ్డిగా ఆన్సర్ చెప్పింది.. తప్పా.. రైటా?