నేను లక్కీ సీఎంను... ఫడ్నవిస్‌ను విపక్ష నేత అని పిలవను : సీఎం ఉద్ధవ్ ఠాక్రే

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (16:15 IST)
తానొక లక్కీ ముఖ్యమంత్రిని అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పైగా, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని, ఆయన్ను విపక్ష నేతగా పిలవబోనని చెప్పారు. పైగా, దేవేంద్ర ఫడ్నవిస్ ఓ బాధ్యతగల ముఖ్యమంత్రి అని చెప్పారు. 
 
ఆయన మహారాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను ఫడ్నవీస్‌తో ఎప్పటికీ స్నేహాన్ని కొనసాగిస్తాను. నేను ఇప్పటికీ హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉన్నాను. దీన్ని ఎన్నటికీ వీడను' అని చెప్పారు. 
 
'గత ఐదేళ్లలో నేను ప్రభుత్వాన్ని ఎన్నడూ మోసం చేయలేదు. నేను ఫడ్నవీస్‌ను ప్రతిపక్ష నాయకుడని పిలవను. ఆయనను బాధ్యతాయుత నాయకుడు అని పిలుస్తాను. మాతో ఆయన సఖ్యతతో వ్యవహరించినట్లయితే, ఇరు పార్టీల మధ్య చీలిక వచ్చేది కాదు' అని ఉద్ధవ్ ఠాక్రే చెప్పుకొచ్చారు.
 
'నేను ఓ లక్కీ సీఎంను.. ఎందుకంటే నన్ను వ్యతిరేకించిన వారు నాతో కలిసి ఉన్నారు. గతంలో నాతో కలిసి ఉన్నవారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రజల ఆశీస్సులు దక్కినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. నేను అసెంబ్లీలోకి వస్తానని ఎన్నడూ ఎవరికీ చెప్పలేదు. అయినప్పటికీ ఇక్కడకు వచ్చాను' అని ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments