ఉల్లిఘాటు : బెంగుళూరు రెస్టారెంట్ల సంచలన నిర్ణయం

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (15:59 IST)
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలో ఉల్లిపాయల ధర రూ.వందకు పైగా పలుకుతోంది. అనేక మెట్రో నగరాల్లో ఈ ధరలు రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో బెంగుళూరులోని రెస్టారెంట్లు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. 
 
ముఖ్యంగా, దేశంలో ఆకాశాన్నంటిన ఉల్లిధరలతో బెంబేలెత్తిపోయిన హోటల్ యాజమాన్యాలు ఉల్లి దోశను నిషేధించాయి. అంతేకాదు.. మిగతా ఆహార పదార్థాలలోనూ ఉల్లివాడకాన్ని వీలైనంత వరకూ తగ్గిస్తున్నాయి. బడా రెస్టారెంట్లు ఉల్లివాడకాన్ని తగ్గించేస్తే.. చిన్న, మధ్యస్థాయి హోటళ్లు మాత్రం ఏకంగా ఉల్లి దోశను మెనూ నుంచి తొలగించాయి. ఉల్లి ధరల ఘాటును పెద్ద హోటళ్లు ఎలాగోలా తట్టుకుంటున్నప్పటికీ.. చిన్న హోటళ్లు మాత్రం లబోదిబోమంటున్నాయి.
 
రేటు పెంచితే కస్టమర్లు దూరమయ్యే పరిస్థితి.. రేటు పెంచకపోతే నష్టాల్లోకి కూరకుపోయ్యే ప్రమాదం.. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా చిన్న మధ్యస్థాయి హోటళ్ల పరిస్థితి తయారైంది. దోశను బ్యాన్ చేయడంతో పాటు ఉల్లి వాడకాన్ని తగ్గించడమే వారికి సరైన మార్గంగా తోచింది. లాభనష్టాల విషయం అలావుంచితే.. వినియోగదారుల ఈ నిర్ణయంతో షాకైపోతున్నారు. ఉల్లి వాడకం తగ్గటంతో ఆహార పదార్థాల్లో మునుపటి రుచి కనిపించడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments