ఈ యేడాది నీట్ పరీక్షను ఎలా నిర్వహిస్తారు: ఎన్టీఏ వివరణ

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (12:42 IST)
దేశంలోని వైద్య విద్యా కోర్సుల ప్రవేశానికి జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. గత యేడాది నిర్వహించిన పరీక్షల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ యేడాది నిర్వహించే పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఎన్టీఏ వివరణ ఇచ్చింది. 2025 మే నెలలో నిర్వహించే ప్రవేశ పరీక్షను పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. 
 
ఒకేరోజు, ఒకే షిఫ్ట్ పరీక్ష నిర్వహిస్తారు. జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) మార్గదర్శకాల ప్రకారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్డీఏ) ప్రకటించింది. నీట్-2025ను ఓఎంఆర్ విధానంలో నిర్వహిం చాలా? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించాలా? అనే విషయంలో కేంద్ర విద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు నెలరోజులుగా మల్ల గుల్లాలు పడ్డాయి. 
 
ఈ మేరకు కేంద్రమంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన రెండు సార్లు సమావేశం కూడా నిర్వహించారు. చివరికి ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఇతర వివరాల కోసం అభ్యర్థులు ఎన్డీఏ వెబ్ సైట్‌ పరిశీలించవచ్చని ఎన్టీయే తెలిపింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments