Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం... ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (12:11 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నంలో మరో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రైవేట్ వసతిగృహంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల కథనం మేరకు.. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని ఇబ్రహీంపట్నం మండలం మంగలపల్లి గేట్ వద్ద ఓ ప్రైవేట్ వసతి గృహంలో ఉంటూ సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. 
 
మంగల పల్లికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారికి చెందిన ఈ వసతి గృహం కింద స్థిరాస్తి ఆఫీస్ ఉండగా.. పై అంతస్తులో బాలికల వసతిగృహం ఉంది. చివరి అంతస్తులో బుధవారం రాత్రి స్థిరాస్తి వ్యాపారులకు సంబంధించి ఒకరి జన్మదిన వేడుకలు జరిగాయి. రాత్రి 11 గంటల సమయంలో అందులో పాల్గొన్న నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జోన్నాయిచింతకు చెందిన అజిత్ (22) వసతి గృహంలో ఒంటరిగా ఉంటున్న విద్యార్థిని గదిలోకి వెళ్లి అత్యాచారం చేస్తుండగా కేకలు వినిపించాయి. 
 
దీంతో పక్క గదిలోని నలుగురు విద్యార్థులు తలుపునకు గడియ పెట్టి డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అజిత్ గతంలో వసతి గృహం యజమాని వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేశాడని, వసతి గృహంలో సైతం ఉండేవాడని తెలిసింది. ఈ వసతి గృహం పరిసరాలన్నీ క్షుణ్ణంగా తెలిసివుండటంతో ఈ దారుణానికి తెగబడినట్టు పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు కనకరత్నం కు నివాళి అర్పించిన రామ్ చరణ్, అన్నాలెజినోవా

అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ మృతి

Nag: నాగార్జున 100వ చిత్రం, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాగ చైతన్య టీమ్

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మైథలాజికల్ థ్రిల్లర్ మయూఖం

గ్రాండ్ పేరెంట్స్‌‌కి ఉచితంగా ప్రదర్శించనున్న త్రిబాణధారి బార్బరిక్ టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments