Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తన కుమారుడిని ఓపెన్ ఏఐ హత్య చేసింది : తల్లి పూర్ణమ రావు

Advertiesment
suchir balaji

ఠాగూర్

, శుక్రవారం, 17 జనవరి 2025 (09:38 IST)
చాటీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ‌పై ప్రజావేగు (విజిల్ బ్లోయర్) తల్లి సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడిని ఓపెన్ఏఐ సంస్థ హత్య చేసిందంటూ ఆరోపించారు. ఈ సంస్థలో నాలుగేళ్లుగా విజిల్ బ్లోయర్, భారత సంతతికి చెందిన సుచిర్ బాలాజీ (26) ఇటీవల అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఓపెన్ఏఐ సంస్థ తన కుమారుడిని హత్యచేసిందని పేర్కొన్నారు. ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా తన కుమారుడి వద్ద ఆధారాలు ఉన్నాయని, వారు ఏమి చేస్తున్నారనే విషయాలు అతడికి తెలుసన్నారు. తమ రహస్యాలు ఎవరికి తెలియకుండా ఉండాలనే కారణంతోనే తన కొడుకుని పొట్టపెట్టుకున్నట్లు ఆరోపించారు.
 
అమెరికాలో టక్కర్ కార్లసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కుమారుడి మరణం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి పలు విషయాలను బహిర్గతం చేశారు. 'నా కుమారుడు చనిపోవడానికి ఒకరోజు ముందు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నాడు. ఒక వేళ తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆ వేడుకలు జరుపుకొనే వాడా? తనకు ఆ ఉద్దేశం ఉంటే తన తండ్రి పంపించిన పుట్టిన రోజు బహుమతులను బాలాజీ చనిపోయే రోజు ఎలా అందుకుంటాడు' అని అనుమానాలు వ్యక్తం చేశారు.
 
అలాగే, 'ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా నా కుమారుడి వద్ద ఆధారాలు ఉన్నాయి. అందుకే దాడి చేసి చంపారు. తను చనిపోయాక కొన్ని డాక్యుమెంట్లు కనిపించడం లేదు. చాటీజీపీటీ రూపకర్తలు విచారణపై ప్రభావం చూపారు. ఈ విషయం గురించి తెలిసిన సాక్షులను తమ పరిధిలో ఉంచుకున్నారు. నిజం చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. న్యాయవాదులు సైతం దీన్ని ఆత్మహత్యగా పేర్కొంటున్నారు. కేవలం 14 నిమిషాల వ్యవధిలోపే తన కుమారుడి మృతిని ఆత్మహత్యగా అధికారులు తేల్చారు' అని పూర్ణిమ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 
కాగా, శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన అపార్టుమెంటులో గతేడాది నవంబరు 26వ తేదీ బాలాజీ మృతి చెందాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసుల దీన్ని ఆత్మహత్యగా పేర్కొన్నారు. దీంతో బాలాజీ మృతిపై అతడి అమ్మ పూర్ణిమరావు న్యాయపోరాటానికి దిగారు. తన కుమారుడు మృతిపై అనుమానాలు ఉన్నట్టు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడలిని చంపి ఇంటి ఆవరణలో పాతిపెట్టారు.. బొందపెట్టిన స్థలంపైనే పొయ్యిపెట్టి పిండివంటలు చేశారు..