Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీట్ యూజీ తుది ఫలితాలను వెల్లడించిన ఎన్టీయే.. సుప్రీం తీర్పు మేరకు సవరణ!!

Advertiesment
neet exam

వరుణ్

, గురువారం, 25 జులై 2024 (19:19 IST)
వైద్య విద్యా కోర్సు ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాలను మరోమారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) గురువారం వెల్లడించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా సవరించిన ఫలితాలను విడుదల చేసింది. ఫిజిక్స్‌‍లో అడిగిన ఓ ప్రశ్నకు సంబంధించి పలువురు విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను తొలగించి, తాజా ఫలితాలను విడుదల చేశారు. 
 
నీట్ ప్రశ్నపత్రంలోని 29వ ప్రశ్నకు రెండు ఆప్షన్లు కరెక్ట్ అని నీట్ ఇటీవల పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గురు నిపుణుల త్రిసభ్య కమిటీ ఆప్షన్ 4 సరైన సమాధానంగా పేర్కొంది. దాన్ని టిక్ చేసిన వారికే మార్కులు కేటాయించింది. ఈ యేడాది మే నెలలో నిర్వహించిన యూజీ ఎంట్రెన్స్ పరీక్ష తీవ్ర వివాదాస్పదమైన విషయం తెల్సిందే. 
 
ప్రశ్నపత్ర లీక్, కాపీయింగ్, మాస్ కాపీయింగ్ వంటి అంశాలు వెలుగుచూశాయి. పైగా, జూన్ 14వ తేదీన విడుదల చేయాల్సిన ఈ ఫలితాలను జూన్ 4వ తేదీనే విడుదల చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ ఫలితాల్లో 67 మందికి 720కు 720 మార్కులు రావడంతో వారంతా టాపర్లుగా నిలిచారు. ఇపుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ 67 మంది టాపర్లలో 44 మంది తమ ఫస్ట్ ర్యాంకును కోల్పోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13 ఏళ్ల బాలికకు గుండె మార్పిడి.. కేరళ వైద్యులు అదుర్స్