Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ యూజీ పరీక్షపై అసత్య ప్రచారం.. కన్నెర్రజేసిన ఎన్టీయే

ఠాగూర్
గురువారం, 1 మే 2025 (19:14 IST)
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (యూజీ) పరీక్షకు (NEET UG 2025) సంబంధించి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఎన్టీయే (NTA) చర్యలు చేపట్టింది. ఈ పరీక్షపై తప్పుదారిపట్టించే సమాచారాన్ని ఆన్‌లైన్ ప్రచారం చేస్తున్న దాదాపు 120కి పైగా సామాజిక మాధ్యమఖాతాల్ని గుర్తించి కేసులు నమోదు చేసినట్టు సమాచారం. వీటిలో 106 టెలిగ్రామ్, 16 ఇన్‌స్టాగ్రామ్ చానళ్లు ఉన్నట్టు ఎన్టీఏ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఛానళ్ళపై తదుపరి దర్యాప్తు కోసం కేసులను కేంద్ర హోం శాఖ పరిధిలోని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు బదిలీ చేసినట్టు సమాచారం. 
 
అలాగే, అసత్య ప్రచారాన్ని, విద్యార్థుల్లో అనవసర భయాందోళనల్ని నివారించేందుకు ఈ చానళ్లను తొలగించాలని టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ సంస్థలను సైతం కోరినట్టు తెలుస్తోంది. నీట్ ప్రశ్నపత్రం గురించి తప్పుడు ప్రచారం చేసే అనధికార వెబ్‌సైట్/సోషల్ మీడియా ఖాతాలు, పరీక్ష కంటెంట్ యాక్సెస్‌కు సంబంధించి క్లెయిమ్ చేసే వ్యక్తుల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎన్టీయే ఇటీవల కొత్త వేదికను ప్రారంభించిన విషయం తెలిసిందే. 
 
ఈ పరీక్షకు సంబంధించి అనుమానాస్పద కంటెంట్ ప్రచారం చేసినట్టు గుర్తిస్తే పోర్టు చేయవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 1500కు పైగా ఫిర్యాదులు అండగా వీటిలో అధికభాగం టెలిగ్రామ్ చానల్‌ లింక్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ యేడాది నీట్ యూజీ పరీక్ష ఈ నెల 4వ తేదీన జరుగనున్న విషయం తెల్సిందే. నీట్ అడ్మిట్ కార్డులను ఎన్టీయే బుధవారం విడుదల చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం