Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జేఈఈ 2025 మెయిన్స్‌ : ఎన్టీఏ కీలక ప్రకటన

jee exam

ఠాగూర్

, మంగళవారం, 29 అక్టోబరు 2024 (09:22 IST)
వచ్చే విద్యాసంవత్సరం (2025-26)కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) (మెయిన్) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రటించింది. ఈ పరీక్షను రెండు సెషన్లుగా నిర్వహించనున్నట్టు పేర్కొంది. 
 
జనవరి నెలలో జేఈఈ సెషన్-1 ను, ఏప్రిల్ నెలలో సెషన్-2ను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అక్టోబరు 28 నుండి నవంబరు 22 వరకు జనవరి సెషన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ సెషన్‌కు సంబంధించి 2025 జనవరి 22 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనుంది. ఫలితాలను ఫిబ్రవరి 12వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.
 
సెషన్-2కి సంబంధించి జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 24వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ సెషన్‌కు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ఫలితాలను 2025 ఏప్రిల్ 17లోగా విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటి సాయిపల్లవి: భారత సైన్యం గురించి ఏం మాట్లాడారు, సోషల్ మీడియాలో రేగుతున్న వివాదం ఏంటి?