Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాతో సరిహద్దు ఘర్షణ : జపాన్‌తో భారత్ యుద్ధ నౌకల విన్యాసాలు

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (19:41 IST)
ఒకవైపు, సరిహద్దుల్లో భారత్ - చైనా దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు నెలకొనివున్నాయి. ఇరు దేశాల సైనికులు సరిహద్దుల్లో భారీగా మొహరించివున్నారు. ఈ క్రమంలో భారత్ తన మిత్రదేశాల్లో ఒకటైన జపాన్‌తో కలిసి హిందూ మహాసముద్రంలో యుద్ధ నౌకల సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. 
 
ఓ వైపు తూర్పు లఢక్‌లోని గల్వాన్‌ సరిహద్దులో భారత్‌, చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో మిత్ర దేశమైన జపాన్‌తో కలిసి భారత్‌ ఈ నౌకా విన్యాసాల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
భారత్‌, జపాన్‌కు చెందిన యుద్ధ నౌకలు ఇటీవల తరచుగా విన్యాసాలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం హిందూ మహాసముద్రంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించినట్లు ఇరు దేశాల నావికా దళాలు ప్రకటించాయి. భారత్‌, జపాన్‌ నుంచి రెండేసీ యుద్ధ నౌకలు ఇందులో పాల్గొన్నట్లు తెలిపాయి. 
 
భారత శిక్షణా నౌకలైన ఐఎన్‌ఎస్‌ రానా, ఐఎన్‌ఎస్‌ కులుష్, జపాన్ నావికాదళానికి చెందిన జెఎస్ కాశీమా, జెఎస్ షిమాయుకి ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. మారిటైమ్, సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్‌పై పరస్పర అవగాహనకు ఈ నౌకా విన్యాసాలు నిర్వహించినట్లు ఇరు దేశాలు తెలిపాయి. 
 
వ్యూహాత్మక సమాచార మార్పిడి కోసం ఈ విన్యాసాలు జరిపినట్లు నేషనల్ మారిటైమ్ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ ప్రదీప్ చౌహాన్ తెలిపారు. ఇది నావికాదళాల పోరాట ప్రయోజనాల కోసం కాదని, కేవలం సిగ్నలింగ్ కోసమేనని ఆయన చెపారు.
 
కాగా, గత మూడేండ్లలో భా‌రత్‌తో కలిసి సంయుక్త నౌకాదళ విన్యాసాలు నిర్వహించడం ఇది 15వసారి అని ఢిల్లీలోని జపాన్ రాయబార కార్యాలయం తెలిపింది. దీనికి ఎలాంటి నిర్దిష్టమైన లక్ష్యం లేదని, కేవలం వ్యూహాత్మక సమాచార శిక్షణ కోసం తాజా విన్యాసాలు జరిగినట్లు జపాన్‌ ఎంబసీ ప్రతినిధి తోషిహిడే ఆండో చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments