Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగ్రా హైవేపై దారుణం : ప్రముఖ వైన్ వ్యాపారి కారులో సజీవదహనం!!

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (09:19 IST)
ముంబై - ఆగ్రా హైవేపై దారుణం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త సజీవదహనమయ్యారు. మృతుని పేరు సంజయ్ షిండే. ప్రముఖ వైన్ వ్యాపారి. ద్రాక్ష ఎగుమతిదారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎన్సీపీ కీలక నేత. ఆయననను తన సొంత కారులోనే కాలిబూడిదయ్యారు. ద్రాక్ష తోటల కోసం పురుగు మందులను కొనుగోలు చేసేందుకు పింపాల్ గావ్‌కు ఆయన తన కారులో వెళుతున్న వేళ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, ముంబై, ఆగ్రా హైవేపై బస్వంత్ టోల్ ప్లాజా సమీపంలో కారులో షార్ట్ సర్క్యూట్ అయిందని తెలిపారు. కారులో శానిటైజర్‌లు ఉండటంతో, మంటలు మరింతగా చెలరేగాయని, ఇదేసమయంలో సెంట్రల్ లాకింగ్ మెకానిజమ్ జామ్ కావడంతో, డోర్లు తీసుకుని ఆయన బయటకు రాలేకపోయారని తెలిపారు. 
 
కారు తగులబడి పోవడాన్ని గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వగా, ఫైర్ ఇంజన్ వచ్చి, మంటలను ఆర్పిందని, ఆ తర్వాతే కారులో ఉన్నది సంజయ్ షిండే అని తెలిసిందని అన్నారు. కాగా, నాసిక్ ప్రాంతంలో సంజయ్ ఎంతో పేరున్న వ్యక్తి. అటు వ్యాపారంలో, ఇటు రాజకీయాల్లోనూ రాణించారు. సంజయ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments