Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషుడిపై సామూహిక అత్యాచారం.. కొబ్బరి చిప్పను శరీరంలోకి..?

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (11:48 IST)
మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్న తరుణంలో.. పురుషుడిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. రాత్రి పూట ఓ వ్యక్తిని సిగరెట్ కావాలని అడిగిన దుండగులు అతడికి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అంతేకాదు.. అతడ్ని శారీరకంగా హింసించి, వెనుక నుంచి ఎండిన కొబ్బరి చిప్పను శరీరం లోపలికి పంపారు. నవీ ముంబైలోని వసీలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో 36 ఏళ్ల వ్యక్తిపై ఈ ఘటన జరిగింది. ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా సాగర్ విహార్ లేక్ వద్ద అతడ్ని ఆపి సిగరెట్ అడిగారు కొందరు డ్రగ్స్‌కు బానిసలైన వ్యక్తులు. ఇంతలో.. అతడ్ని కిడ్నాప్ చేసి చెట్ల చాటుకు తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
నంతరం అతడి పురుషాంగంపై దాడి చేసి, వెనుక భాగం నుంచి లోపలికి ఓ కొబ్బరి చిప్పను దూర్చి పరారయ్యారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడ్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. 
 
వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు అతడికి సర్జరీ చేసి కొబ్బరి చిప్పను తొలగించారు. ప్రస్తుతం బాధితుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments