తుమ్మితే చాలామంది కూర్చున్నచోట నుంచి కదలరు. ఏదైనా పనికోసం వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే ఇక ఆ పని అవదని చాలామంది విశ్వసిస్తుంటారు. ఈ నమ్మకం ఇప్పటికీ వుంది. ఇక పూర్వ గ్రంధాలలో ఈ తుమ్ములపై వున్న విశ్వాసం ఎలా వుందో చూద్దాం.
అనేకమైన తుమ్ములు వరుసబెట్టి తుమ్మితే వెళ్లిన కార్యం జయమవుతుందని భావించాలి. తుమ్మిన తర్వాత దగ్గితే ధన లాభం. తుమ్మిన వెంటనే ఏ వ్యక్తయినా చీదినట్లయితే తలపెట్టే పనులను వాయిదా వేసుకోవడం మంచిది.
భోజనం చేసే సమయంలో, పడుకునే సమయంలో, తాంబూలం సేవించే సమయంలో తుమ్మినట్లయితే మంచిదే. అలాగే ప్రయాణం చేసేటపుడు కానీ, కార్యాలోచన చేసేటపుడు కానీ నాలుగు కాళ్ల జంతువు తుమ్మినట్లయితే ఆపద కలుగుతుంది.
నడుస్తూ వెళ్తున్నప్పుడు పక్కనే వున్న వ్యక్తి తుమ్మినట్లయితే కష్టమలు వస్తాయి. వీటిన్నిటినీ అధిగమించాలంటే తుమ్మినప్పుడు కంచు లేదా రాగి లేదా బంగారాన్ని పట్టుకుంటే దోషాలు తొలగి విజయం చేకూరుతుంది.
బాలబాలికలు, వ్యభిచార స్త్రీలు, బాలింతలు, అంగవైకల్యం కలవారు తుమ్మినట్లయితే కార్యజయం కలుగుతుంది. ఇక ఏదేని శుభకార్యానికి వెళ్లేటపుడు స్త్రీలు తుమ్మినట్లయితే అది శుభకరమవుతుంది.