Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 17తర్వాత ఏం చేద్దాం..? ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ

Webdunia
మంగళవారం, 12 మే 2020 (09:42 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నెల 15 నాటికి తదుపరి చర్యలపై బ్లూ ప్రింట్ ఇవ్వాలని సీఎంలకు సూచించారు. ఒక వేళ లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే.. ఆ తర్వాత వచ్చే సమస్యలను ఎలా అధిగమించాలో కూడా పంపాలని సీఎంలను మోదీ కోరారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ మహమ్మారి పరిణామాలు, భారత్‌లో కేసుల సంఖ్య, రాష్ట్రాల ఆర్ధిక స్థితిగతులపై ప్రతి ఒక్క సీఎం అభిప్రాయాన్ని ప్రధాని తీసుకున్నారు. మూడో విడత లాక్‌డౌన్‌ తర్వాత కొన్ని నిబంధనల్ని అమలు చేస్తూనే సాధారణ జనజీవనం వైపు దేశాన్ని నడిపించాల్సిన అవసరాన్ని ప్రతి ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. మే 17తర్వాత కొన్ని సడలింపులకు కేంద్రం కూడా సంసిద్దత వ్యక్తం చేసింది. 
 
అయితే పేరుకు మాత్రమే లాక్ డౌన్ వుంటుంది.. కేవలం రెడ్‌జోన్‌లు, కంటైన్‌మెంట్‌ జోన్లలోనే నిబంధనలు కఠినతరంగా ఉంటాయి. ఇక దేశవ్యాప్తంగా భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి. అయితే, ఇప్పుడు లాక్‌డౌన్ నాలుగు ఎలా వుంటుందనేది నిర్ణయించాల్సి వుంది. మే 15కల్లా రాష్ట్రాలు ఇచ్చే నివేదికలను కేంద్రం రెండు రోజుల పాటు పరిశీలిస్తుంది. ఇంకా మే 17వ తేదీన ఏం చేయాలనే అంశంపై కేంద్రం పరిశీలిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments