Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రామాలకు వ్యాపించకుండా కట్టడి చేయడమే ఓసవాల్ : ప్రధాని మోడీ

గ్రామాలకు వ్యాపించకుండా కట్టడి చేయడమే ఓసవాల్ : ప్రధాని మోడీ
, సోమవారం, 11 మే 2020 (20:34 IST)
కరోనా వైరస్ గ్రామాలకు వ్యాపించకుండా కట్టడి చేయడమే ఇపుడు మనముందున్న అతిపెద్ద సవాల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ తదితర అంశాలపై ఆయన సోమవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, క‌రోనా వైర‌స్ గ్రామాల‌కు సోక‌కుండా చూసుకోవ‌డ‌మే అతిపెద్ద స‌వాల్ అన్నారు. కోవిడ్‌19 నుంచి ఇండియా త‌న‌ను తాను ర‌క్షించుకున్న‌ట్లు ప్ర‌పంచ దేశాలు భావిస్తున్నాయ‌ని, అయితే వైర‌స్ నియంత్ర‌ణ‌లో అన్ని రాష్ట్రాలు స‌హ‌క‌రించిన‌ట్లు మోడీ తెలిపారు. 
 
సోష‌ల్ డిస్టాన్సింగ్ పాటించ‌ని ప్రాంతాల్లో కేసులు పెరిగిన‌ట్లు ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మీరు ఇచ్చే స‌ల‌హాల మేర‌కే మ‌న భ‌విష్య‌త్తుకు మార్గం వేద్దామ‌ని సీఎంల‌తో మోదీ తెలిపారు. కొవిడ్-19 నుంచి భారత్ తనను కాపాడుకున్న తీరు అమోఘమని యావత్ ప్రపంచం భావిస్తోందని, అందుకు రాష్ట్రాల చిత్తశుద్ధే కారణమని అన్నారు. 
 
దేశంలో కరోనా కట్టడిలో రాష్ట్రాలు ప్రధాన భూమిక పోషించాయని తెలిపారు. "ఇవాళ మీరు అందించే సూచనల ఆధారంగానే మన దేశం పయనించాల్సిన దిశను నిర్ణయించుకుందాం. అయితే సడలింపుల నేపథ్యంలో కరోనా మహమ్మారి గ్రామాలకు విస్తరించకుండా చూడడమే మనముందున్న అతి పెద్ద సవాలు. భౌతికదూరం పాటించడాన్ని ఎప్పుడు విస్మరిస్తామో అప్పుడే మన సమస్యలు మరింతగా పెరుగుతాయి" అని మోడీ వ్యాఖ్యలు చేశారు.
 
అంతేకాకుండా, ఎక్కడివారు అక్కడ ఉంటేనే కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడి చేయగలమని భావించామని, కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇంటికి చేరుకోవాలనుకోవడం అనేది మానవస్వాభావిక లక్షణం అని, వలస కార్మికుల పరిస్థితి కూడా అలాంటిదేనని అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడులో 8వేల మార్కును దాటిన కరోనా కేసులు.. రైళ్లు వద్దు సార్..