దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

ఠాగూర్
బుధవారం, 11 జూన్ 2025 (18:53 IST)
మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై సోదరుడు గోవింద్ రఘువంశీ స్పందించారు. ఆయన బుధవారం మృతుడు రాజా రఘువంశీ తల్లితో పాటు కుటుంబ సభ్యులను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా సోనమ్‌తో అన్న సంబంధాలు తెంచుకుందని ప్రకటించారు. ఒకవేళ సోనమ్ దోషి అని తేలితే ఉరితీయాలని సోదరుడు గోవిద్ రఘువంశీ డిమాండ్ చేశారు. 
 
బుధవారం ఇండోర్‌లోని రాజా రఘువంశీ నివాసానికి వెళ్లిన గోవింద్, రాజా తల్లి ఉమా రఘువంశీని ఆలింగనం చేసుకుని బోరున విలపించారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని కలిచివేశాయి. మే 11వ తేదీన వివాహం చేసుకున్న సోనమ్ (24), రాజా (29) నవ దంపతులు హనీమూన్‌కి వెళ్లగా పెళ్లయిన 12 రోజులకే మే 23వ తేదీన రాజా హత్యకు గురయ్యారు. 21 యేళ్ల రాజ్ కుశ్వాహాతో సోనమ్ ప్రేమ వ్యవహరం ఉందని, అతడి స్నేహితుల సహాయంతో ఈ హత్యకు కుట్ర పన్నా రని పోలీసులు విచారణలో వెల్లడైంది. సోనమ్ ఇప్పటికే నేరం అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఆ తర్వాత రాజా సోదరుడు విపిన్‌తో కలిసి ప్రతినిదులతో మాట్లాడిన గోవింద్... "సోనమ్ ఈ హత్య వెనుక ఉందని ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ, బయటకు వస్తున్న సాక్ష్యధారాలు చూస్తుంటే, ఆమెనే ఈ దారుణం చేయించిందనిపిస్తోంది. ఈ కేసులో వినిపిస్తున్న మిగతా నిందితుల పేర్లన్నీ రాజ్ కుష్వాహాకు సంబంధించినవే" అని తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments