Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో నిర్భయ : రేప్ చేసి ప్రైవేట్ పార్ట్స్‌లో రాడ్‌ చొప్పించాడు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (22:45 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో మరో నిర్భయ ఘటన జరిగింది. ఓ మహిళపై ఓ కామపిశాచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో ఇనుప రాడ్ చొప్పించాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన ముంబైలో జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై మహానగరంలోని సకినాక ప్రాంత ఖైరాని రోడ్డుకు చెందిన 32 ఏళ్ల బాధిత మహిళ నివసిస్తుంది. ఈ మహిళపై కన్నేసిన ఓ కామాంధుడు ఆమెపై లైంగికదాడికి తెగబడ్డాడు. దీంతో ఆ మహిళ అపస్మారక స్థితిలోకి జారుకుంది. 
 
అయితే, ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉందని తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కంట్రోల్ రూముకు ఫోన్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు బాధిత మహిళను ఘట్కోపర్‌లోని రాజావాడి ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. 
 
ఈ దారుణానికి తెగబడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉండి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే డీసీపీ, అడిషనల్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments