Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ మేనకోడలిని గర్భవతిని చేసిన మేనమామ

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (10:41 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఘోరం జరిగింది. మేనకోడలిపై మేనమామ అత్యాచారం చేశాడు. ఈ ఘటన కొన్నేళ్ళ క్రితం పుష్కరకాలం క్రితం జరిగింది. ఈ కేసు విచారణ ముంబై ప్రత్యేక కోర్టులో సాగుతూ రాగా, తాజాగా తుదితీర్పు వెల్లడైంది. మైనర్ మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడినందుకు మేనమామకు 12 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మేనకోడలిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మేనమామ... ఆమె జీవితాన్ని చిన్నవయసులోనే చిదిమేశాడు. 13 యేళ్ల మైనర్ బాలిక అయిన మేనకోడలిపై 27 ఏళ్ల మేనమామ పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భందాల్చింది. 
 
బాలిక శరీరంలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లి కుమార్తెను నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. అయితే, ఆ తర్వాత ఫిర్యాదు ఆమె వెనక్కి తీసుకుంది. 
 
కానీ, వైద్యులు, పోలీసులు అందించిన సాక్ష్యధారాలను పరిశీలించిన ముంబై ప్రత్యేక కోర్టు నిందితుడికి 12 ఏళ్ల కఠిన కారాగారశిక్షను విధించింది. బాధితురాలి కుటుంబంతో నిందితుడు రెండున్నర నెలలు గడిపాడని... ఆ సమయంలో ఆమెను పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలడంతో జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments