Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దారుణం : లేడీ ఫ్యాషన్ డిజైనర్‌పై టీవీ నటుడు రేప్

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. లేడీ ఫ్యాషన్ డిజైనర్‌పై బుల్లితెర నటుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను నటించే టీవీ సీరియల్స్, తనకు తెలిసినవారి ద్వారా మోడలింగ్‌లో అవకాశాలిప్పిస్తామని ఆశ కల

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (08:53 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. లేడీ ఫ్యాషన్ డిజైనర్‌పై బుల్లితెర నటుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను నటించే టీవీ సీరియల్స్, తనకు తెలిసినవారి ద్వారా మోడలింగ్‌లో అవకాశాలిప్పిస్తామని ఆశ కల్పించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ టీవీ నటుడి పేరు పియూష్ సహదేవ్ (35). ఈ మేరకు 23 యేళ్ల వయసున్న మోడల్ వెర్సోవా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 (1) కింద కేసు నమోదు చేసి, సహదేవ్‌ను అరెస్టు చేశామని తెలిపారు. 
 
పీయూష్ సహదేవ్ 'దేవన్ కీ దేవ్.. మహదేవ్, సప్నే సుహానే లడక్ పన్ కే, బేహాద్, మీట్ మిలాదే రబ్బా, ఘర్ ఏక్ సప్నా, గీత్, మన్ కే అవాజ్, హమ్ నే లీహై శపథ్ టీవీ షోలలో నటించాడు. అంతేకాకుండా, పీయూష్ సహదేవ్ ఫ్యాషన్ డిజైనర్‌తో రెండు నెలలుగా సహజీవనం చేశాడని వార్తలు బాలీవుడ్‌లో షికారు చేస్తున్నాయి. మొత్తంమీద ప్రముఖ హిందీ టీవీ నటుడు పీయూష్ సహదేవ్ అత్యాచారం కేసులో అరెస్టు చేయడం ముంబైలో సంచలనం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments