Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో హైప్రొఫైల్ సెక్స్ రాకెట్.. ముగ్గురు ఆర్టిస్టులకు విముక్తి

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (12:03 IST)
ముంబై నగరంలో ఓ హైప్రొఫైల్ వ్యభిచార గుట్టును పోలీసులు ఛేదించారు. ఓ త్రీస్టార్ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతూ వచ్చిన ఈ బండారాన్ని బయటపెట్టారు. ఇందులో ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులకు విముక్తి కల్పించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని ఓ మూడు నక్షత్ర హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం సాగుతున్నట్టు నగర పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకిదిగి ప్రత్యేక నిఘా సారించారు. ఈ వ్యవహారంలో కందివ్యాలీలో టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న ప్రియాశర్మ, ఈ మొత్తం సెక్స్ రాకెట్ లో ప్రధాన సూత్రధారని గుర్తించారు. హోటల్‌పై దాడి చేయాలని పక్కా ప్లాన్ వేశారు.
 
తమ ప్లాన్‌లో భాగంగా, ప్రియా శర్మ(29)ను ట్రాప్ చేసిన పోలీసులు, ఆమె, ముగ్గురు ఆర్టిస్టులతో హోటల్‌లో ఉన్న సమయంలో దాడులు జరిపారు. ఓ టీవీ చానెల్ క్రైమ్ షోలో యాంకర్‌గా ఉన్న యువతి, ఓ వెబ్ సీరీస్‌లో నటించిన మైనర్ బాలిక, మరాఠీ చిత్రాలు, సీరియల్స్‌లో రాణిస్తున్న ప్రముఖ నటిని ప్రియా శర్మతో ఉండటాన్ని చూసి, వారిని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ప్రియా శర్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం