Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిపబ్లిక్ టీవీకి మరో షాక్ : టీఆర్పీ తారుమారు కేసులో మరొకరి అరెస్టు

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (12:43 IST)
జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీకి మరో షాక్ తగిలింది. టీఆర్పీ రేటింగ్‌ను తారుమారు చేశారన్న ఆరోపణల కేసులో ఆ చానల్ డిస్టిబ్యూషన్ విభాగం అధిపతి ఘన్‌శ్యామ్ సింగ్‌ను ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. 
 
టీఆర్పీ రేటింగ్స్ ను తారుమారు చేశారంటూ అందిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. టీఆర్పీ అవకతవలకు సంబంధించి తాజా అరెస్టును కలిపితే... ఇప్పటివరకు మొత్తం 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
 
రిపబ్లిక్ టీవీపై కొందరు వీక్షకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రారంభించారు. తాము టీవీ చూడకపోయినా... రిపబ్లిక్ టీవీని ఆన్ చేసి పెట్టుకుంటే తమకు డబ్బులు చెల్లిస్తారని వారు చెప్పడంతో... మీడియా ప్రపంచంలో అలజడి చెలరేగిన విషయం తెల్సిందే. 
 
దీంతో వెంటనే రంగంలోకి దిగిన ముంబై పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. అయితే ఆ చానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని మాత్రం ఓ ఇంటీరియల్ డిజైనర్, ఆయన తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేశారన్న కేసులో అరెస్టు చేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments