ముంబైలోని మలాద్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే బ్రిడ్జి నుంచి కిందకు దిగిన ఆ వ్యక్తి ప్లాట్‌ఫామ్‌పై నడుస్తూ వెళుతున్నాడు. ఓ లోకల్ ట్రైన్ అతడి వెనుక నుంచి వస్తోంది. ఈ విషయ
ముంబైలోని మలాద్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే బ్రిడ్జి నుంచి కిందకు దిగిన ఆ వ్యక్తి ప్లాట్‌ఫామ్‌పై నడుస్తూ వెళుతున్నాడు. ఓ లోకల్ ట్రైన్ అతడి వెనుక నుంచి వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించి ఆ వ్యక్తి ఒక్కసారిగా ట్రైన్ ముందుకు దూకాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరోవైపు చిన్నచిన్న కారణాలతో క్షణికావేశానికి గురై తనువు చాలిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదీ వీడియో తీసి బంధువులకు పంపించాడు. సిద్దిపేట కనకదుర్గ కాలనీకి చెందిన కనకరాజు.. తన బావమరుదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని అందుకు ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
కనకరాజు భార్య ఇటీవల మృతి చెందింది. దీనికి కనకరాజు కారణమంటూ ఇటీవల ఆయన బావమరుదులు దాడి చేసినట్టు తెలిసింది. ఈక్రమంలో వారు మరోసారి దాడిచేస్తారన్న భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో కనకరాజు చెప్పాడు. అత్తగారింటి నుంచి వేధింపులు తాళలేక తాను చనిపోతున్నానని సూసైడ్ నోట్‌లోనూ సెల్ఫీలోనూ కనకరాజు తెలిపాడు.