Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. ఒంటిపై 10 కత్తిపోట్లు.. ముంబైలో దారుణం

Webdunia
సోమవారం, 3 మే 2021 (15:25 IST)
భార్యపై అనుమానంతో ఓ భర్త పాశవికంగా ప్రవర్తించాడు. భార్యను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని తూర్పు కందివాలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహేష్ సోని అనే వ్యక్తి డైమండ్ పాలిషింగ్ యూనిట్‌లో పని చేసేవాడు.
 
భార్య పూనమ్, కొడుకు శివసోని, ఇద్దరూ కూతుళ్లతో కలిసి తూర్పు కందివాలి పరిధిలోని లోపాయిసర్ సమీపంలో క్రాంతినగర్‌లో నివసిస్తున్నాడు. మహేష్‌కు, తన భార్య పూనమ్ ప్రవర్తన పట్ల గత కొంతకాలంగా అనుమానం పెరిగింది. ఈ కారణంగా తరచూ భార్యాభర్తలు గొడవ పడసాగారు. కొన్నేళ్లుగా ఉద్యోగం కూడా పోవటంతో…. కొడుకు శివసోని సంపాదన మీదే కుటుంబం గడుస్తోంది.
 
శనివారం ఇంట్లో ఉన్న మహేష్ భార్యతో గొడవకు దిగాడు. ఆమెను ఇంట్లోని గదిలోకి తీసుకు వెళ్లి దాడి చేశాడు. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి వారికి సర్ది చెప్పబోయారు. 
 
మహేష్ వారిని చంపేస్తాననని బెదిరించటంతో వారు వెనక్కి తగ్గారు. కాసేపటి తర్వాత వారు వెళ్లగానే గది తలుపులు వేసిన మహేష్ కత్తితో భార్యను పాశవికంగా పొడిచి హత్య చేశాడు.
 
గొడవ సర్దుమణిగాక అటువైపు వచ్చిన పొరుగువారు రక్తపు మడుగులో పడి ఉన్నపూనమ్ మృతదేహం చూసి నిశ్చేష్టులయ్యారు. ఆమె కుమారుడు శివసోనీకి సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన శివ సోనీ పోలీసులకు తండ్రిపై ఫిర్యాదు చేశాడు.
 
పూనమ్ ఒంటిపై 10 కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా తన తండ్రి నిరుద్యోగి గా ఉన్నాడని… ఈ మధ్య కాలంలో మహేష్ సోనీ తన కూతుళ్లు ఒంటిమీద బంగారాన్ని కూడా దొంగతనం చేసినట్లు కుమారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments