Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యపై అనుమానంతో.. నోట్లో గుడ్డలు కుక్కి.. అడ్డంగా నరికేశాడు...

Advertiesment
భార్యపై అనుమానంతో.. నోట్లో గుడ్డలు కుక్కి.. అడ్డంగా నరికేశాడు...
, సోమవారం, 3 మే 2021 (10:05 IST)
కట్టుకున్న భార్య కిరాతకుడుగా మారిపోయాడు. భార్య ప్రవర్తనపై అనుమానంతో అతి కిరాతకంగా నరికేశాడు. భార్య నోట్లో గుడ్డలు కుక్కి అడ్డంగా నరికేశాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్‌ జిల్లా బంట్వారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మద్వాపూర్‌ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మద్వాపూర్‌ గ్రామానికి చెందిన ఆంజనేయులు, లక్ష్మి(40) అనే దంపతులకు 23 యేళ్ల క్రితం వివాహమైంది. వీరు రోజు వారీ కూలి కోసం తాండూరులో ఉంటూ జీవిస్తూ వచ్చారు. 
 
మూడేళ్ల క్రితం నుంచి ఆంజనేయులు భార్య ఆమె తల్లి వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆంజనేయులు కొన్ని రోజుల క్రితం గ్రామంలో పంచాయితీ పెట్టి ఒప్పించి ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. 
 
మళ్లీ ఆమె తన తల్లి ఇంటికి వెళ్లగా శనివారం మద్వాపూర్‌కు వెళ్లి ఇంటికి తీసుకువచ్చాడు. అదే రాత్రి 12 గంటల సమయంలో లక్ష్మి(40) నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కాళ్లు కట్టివేసి కత్తితో మెడ, చేతులపై పొడిచి హత్యచేశాడు.
 
ఇంట్లో నుంచి అరుపులు రావడంతో చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అక్కడి నుంచి ఆంజనేయులు నేరుగా ఉదయం 4 గంటలకు పోలీస్‌స్టేషన్‌‌కు వచ్చి భార్యను హత్య చేసినట్లు అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. భార్యపై అనుమానంతో ఈ హత్య చేసినట్లు ఆయన వివరించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'దీదీ ఓ దీదీ' అంటున్న వర్మ.. వీడియో చూసి నవ్వలేక...