Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరు పిల్లల తల్లి, ఎస్ఐని అని చెప్పగానే పడిపోయింది, కుటుంబాన్ని వదిలి?

Advertiesment
married woman
, శనివారం, 1 మే 2021 (18:26 IST)
ఆమెకు ఇదివరకు పెళ్ళయ్యింది. ఇద్దరు పిల్లలున్నారు. ఆరేళ్ళు, ఎనిమిదేళ్ళలోపు పిల్లలు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన ఆమె పెడదారి పట్టింది. ఫేస్ బుక్ పుణ్యమా అని ఒక ఎస్ఐకి కనెక్టయ్యింది. అంతటితో ఆగలేదు. పచ్చటి సంసారాన్ని చేజేతులా నాశనం చేసుకుంది.
 
తెలంగాణా రాష్ట్రం జగిత్యాల జిల్లాకు చెందిన ఎస్ఐకు ఖమ్మం పట్టణానికి చెందిన వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఫేస్‌బుక్ ద్వారా జరిగింది. ఎస్ఐ మామూలోడు కాదు. తాను అడవిలో ఛేజింగ్ చేస్తున్నట్లు.. దొంగలను పట్టుకున్నట్లు.. అవార్డులు, రివార్డులు అందుకున్నట్లు.. ఇలా ఒక్కటేమిటి.. ఫేస్ బుక్‌లో ఫోటోలతో ఆకర్షించి వివాహితను తనవైపు తిప్పుకున్నాడు.
 
తనకు పెళ్ళి కాలేదని చెప్పి వివాహితకు మాయమాటలు చెప్పాడు. అప్పటికే ఎస్ఐకి వివాహమై కొడుకు కూడా ఉన్నాడు. వివాహిత తనకు ఇద్దరు పిల్లలున్నారని.. నన్ను పెళ్ళి చేసుకుంటానంటే వస్తానని చెప్పింది. దీంతో ఆమెకు మాయమాటలు చెప్పాడు. జగిత్యాలకు పిలిపించుకున్నాడు. 
 
వేరుగా ఇంటిని అద్దెకు తీసుకుని ఉంచాడు. విషయం మూడురోజుల్లోనే ఎస్ఐ భార్యకు తెలిసిపోయింది. గొడవకు దిగింది. డిఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐ బాగోతం బయటపడింది. తాను మోసపోయానని తెలుసుకున్న వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. చావుబతుకుల మధ్య జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

4వేల కిలోమీటర్లు.. విమానంలో ఒకే ఒక్కడు.. అతడి జర్నీ ఎందుకు?