సురేఖావాణి డబుల్ సిమ్ కార్డా!
, శనివారం, 1 మే 2021 (17:09 IST)
నటి సురేఖావాణి తరచూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవలే తన పుట్టినరోజునాడు కేక్‌లు కట్‌చేసి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన ఆమె ఆ మరునాడి స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసింది. తన స్నేహితులు డాన్స్ చేస్తూ చేతితో విజల్స్ వేస్తుండగా వారిని చూసి బాగా ఎంజాయ్ చేసింది కూడా. ప్రస్తుతం షూటింగ్ లేకపోవడంతో ఇంటివద్దనే వుంటూ కుటుంబంతో సరదాగా గడపడం అలవాటైపోయింది.
మేడేనాడు అజిత్ పుట్టిన రోజు సందర్భంగా గత జ్ఞాపకాలకు వెళ్ళిపోయింది. అజిత్‌తో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో అజిత్ చాలా సౌమ్యంగా నిలబడ్డాడు. ఆ పక్కనే తను మామూలుగా నిలబడి ఫోజ్ ఇచ్చింది. ఇది తనకు మధుర జ్ఞాపకాలంటూ ట్వీట్ చేసింది. ఫుట్టినరోజు శుభాకాంక్షలు తల సార్ క్రష్ ఫర్ ఎవర్. అంటూ పోస్ట్ చేసింది. ఓ అభిమాని దానికి స్పందిస్తూ.. డబుల్ సిమ్‌కార్డ్ బబ్లూ.. అంటూ నవ్వుతూ రిప్లయి ఇచ్చాడు. షూటింగ్‌లో బాగా తెలిసినవారే ఆమెను బబ్లూ అంటూ సరదాగా పిలుస్తుంటారు.
తర్వాతి కథనం