Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ సర్కారు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందట...

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (09:54 IST)
కేరళ రాష్ట్రంలోని ఎల్డీఎఫ్ సర్కారు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. మన దేశంలోని కమ్యూనిస్టులు హిందూ సంప్రదాయాలను గౌరవించరని వ్యాఖ్యానించారు. ఒడిషా, కేరళ రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని మోడీ... వామపక్ష పార్టీలతో పాటు.. విపక్షాలే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. 
 
దేశంలో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం తమ ప్రభుత్వానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. శబరిమల విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం.. చరిత్రలో నిలిచిపోయే సిగ్గుమాలిన రాజకీయం చేస్తోందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఏ ప్రభుత్వం, పార్టీ ఈ రకంగా వ్యవహరించలేదన్నారు. కమ్యూనిస్టులు భారత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించరని తెలుసు గానీ.. ఇంతటి ద్వేషం కలిగి ఉంటారని ఊహించలేదని మోడీ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, ప్రతీ భారతీయుడు కులం, మతం అనే తేడా లేకుండా.. ఈ రిజర్వేషన్లు పొందుతారన్నారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మోడీ.. అక్కడే స్వదేశీ దర్శన్ స్కీంను ప్రారంభించారు. రూ.1550 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అవినీతికి తాము అడ్డుకట్ట వేస్తున్నందుకు.. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహంతో ఉందని మోడీ విమర్శించారు. పేదల డబ్బు దోచుకున్న ఎవ్వరినీ వదలబోమని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments