Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో మంకీపాక్స్ కేసు కలకలం: విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి?

Webdunia
గురువారం, 14 జులై 2022 (16:35 IST)
కేరళలో మంకీపాక్స్ కేసు కలకలం రేపుతోంది. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ఒక వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. కేరళ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 
 
మంకీపాక్స్ అనుమానిత రోగి నుంచి శాంపిల్స్ సేకరించినట్లు, వాటిని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరీక్షల కోసం పంపినట్లు ఆమె తెలిపారు. 
 
ఈ ఫలితం వచ్చిన తర్వాతే అతడికి సోకింది మంకీపాక్సా లేదా అనే సంగతి తెలుస్తుందన్నారు.  
 
ఇప్పటివరకు ఇండియాలో మంకీపాక్స్ కేసు నమోదు కాలేదు. ఒకవేళ కేరళ పేషెంట్‌కు మంకీపాక్స్ నిర్ధరణ అయితే, దేశంలో ఇదే తొలి కేసు అవుతుంది. 
 
ఇప్పటివరకు అమెరికా సహా 57 దేశాల్లో, 8,200 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. రెండు రోజుల క్రితం రష్యాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఇది క్రమంగా ఇతర దేశాలకూ వ్యాపిస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments