Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 రోజులు - 3 రాత్రులు... బెంగుళూరు టూరిజం - ట్రాఫిక్ జామ్‌పై పాయ్ వ్యంగ్య ట్వీట్

ఠాగూర్
శుక్రవారం, 14 మార్చి 2025 (12:58 IST)
ప్రముఖ ఆర్థికవేత్త, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాప్ పాయ్ బెంగుళూరు ట్రాఫిక్‌ జామ్ కష్టాలపై ఓ వ్యంగ్య ట్వీట్ చేశారు. 4 రోజులు, 3 రాత్రులు బెంగుళూరు టూరిజం అంటూ వ్యంగ్యంగా ఒక చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీని ద్వారా నగరంలోని ట్రాఫిక్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
 
సిలికాన్ సిటీలోని ఔటర్ రింగ్ రోడ్డు, సిల్క్ బోర్డు జంక్షన్, మారతహళ్లి, హెచ్ఎస్ఆర్ లేఔట్ ప్రాంతాల్లోని ట్రాఫిక్‌ను చూసి ఆయన ఈ పోస్ట్ చేశారు. బెంగుళూరు నగరంలో మౌలిక సదుపాయాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది బెంగుళూరుకు ఒక విషాదకరమైన జోక్ అని అభివర్ణిస్తూ, తమ బాధను చూసి నవ్వుకునే మనసు తమకుందని, కానీ పట్టించుకోని ప్రభుత్వం ఉందని ఆయన విమర్శలు చేశారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
 
పరిశ్రమ, పారిశ్రామిక దిగ్గజాలు హైబ్రిడ్ పని విధానాన్ని లేదాఇంటి నుంచి మరింత పని విధానాన్ని ప్రోత్సహించాలి. ఇది బెంగుళూరు ఉద్యోగులకు కనీసం ఒక్కసారైనా చార్ ధామ్ యాత్ర చేసేందుకు వీలు కలుగుతుంది. లేదంటే ప్రతిరోజూ చార్ జామ్స్ తప్పవు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments