మోదీ వ్యక్తిగతంగా మంచోడే కానీ విధానాలే నాట్ గుడ్.. ఊర్మిళ

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (10:51 IST)
బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరారో లేదో రెండు మూడు రోజుల్లోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ద్వారా దేశంలో సమస్యలపై పోరాడేందుకు తనకు మంచి వేదిక దొరికిందని ఊర్మిళ చెప్పుకొచ్చారు.
 
మోదీ వ్యక్తిగతంగా మంచోడే అయినప్పటికీ ఆయన విధానాలు మాత్రం మంచివి కావని చెప్పారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఏమంత బాగోలేవన్నారు. అన్నింటిలోనూ మతం ప్రధాన పాత్ర వహిస్తోందని ఊర్మిళ ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ విధానాలు మాత్రం మంచివి కావని.. ఆయన విధానాల వల్ల ప్రజల్లో రోజు రోజుకి అసంతృప్తి, అసహనం పెరిగిపోతుందని చెప్పుకొచ్చారు. 
 
తాను కాంగ్రెస్‌లో చేరడానికి ముందే గాంధీ, నెహ్రూల గురించి పూర్తిగా చదివి తెలుసుకున్నట్టు చెప్పారు. తన కుటుంబం కాంగ్రెస్ సిద్ధాంతాలను అనుసరిస్తుందన్నారు. దేశంలో మతం పేరుతో దాడులు, చంపుకోవడాలు దారుణమన్నారు. ఇచ్చిన హామీలను మోదీ అమలు చేయలేకపోయారని, ఫలితంగా దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments