Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏం తిరిగారో? ఏకంగా 92 దేశాలు.. మోదీ గారూ.. అదరగొట్టారే?!

Advertiesment
ఏం తిరిగారో? ఏకంగా 92 దేశాలు.. మోదీ గారూ.. అదరగొట్టారే?!
, శనివారం, 23 మార్చి 2019 (18:28 IST)
ఎన్నికల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై చర్చ మొదలైంది. ద్వైపాక్షిక సంబంధాల కోసం విదేశ పర్యటన చేపట్టిన ప్రధాని మోదీ ఇప్పటివరకు 92 దేశాలు తిరిగొచ్చారు. నెహ్రూజీ నుంచి మోదీజీ వరకు విదేశీ పర్యటనలు ప్రధాని హోదాలో వున్న వారికి మామూలే. 
 
అయితే తాజాగా ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. మోదీ విదేశీ పర్యటనలను పక్కనబెట్టి స్వదేశంలో ఎన్నికల ప్రచారం కోసం పర్యటన చేపట్టారు. కాగా మోదీ గత ఐదేళ్లలో 92 దేశాలను తిరిగొచ్చారు. ఇవి ప్రభుత్వ అధికారిక పర్యటనలు మాత్రమే. 
 
ఇక.. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల కోసం 2014 జూన్ మాసం నుంచి ఇప్పటి వరకు రూ.2,021 కోట్లు వ్యయం చేశారు. అద్దె విమానాలు, విమానాల నిర్వహణ, హాట్‌లైన్ వసతుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 
 
ప్రధాని నరేంద్ర మోదీ 2014 నుంచి 2018 వరకు పర్యటించిన దేశాలు ప్రస్తుతం భారత్‌లో అత్యధిక విదేశీ పెట్టుబడులు చేసిన టాప్-10 దేశాల్లో ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2014లో 30,950.5 మిల్లియన్ డాలర్లుగా ఉండగా...ఇది 2017నాటికి 43,478.27 మిల్లియన్ డాలర్లకు పెరిగినట్లు వీకే సింగ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ ఆస్తుల విలువ రూ.538 కోట్లు... అంతేనా అంటూ చంద్రబాబు షాక్...