Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చౌకీదారే కానీ ధనవంతులకు మాత్రమే... ప్రియాంక వ్యంగ్యాస్త్రాలు

Advertiesment
Priyanka Gandhi
, మంగళవారం, 19 మార్చి 2019 (12:32 IST)
గంగా యాత్ర పేరిట లోక్‍సభ ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించిన ప్రియాంక గాంధీ తన ప్రచారంలో భాగంగా చౌకీదార్ ప్రధాన మంత్రిపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. వివరాలలోకి వెళ్తే... ‘‘నేను కాపలాదారును మాత్రమే’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించిన ప్రచారంపై ఉత్తరప్రదేశ్-ఈస్ట్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
‘‘వాళ్లు ధనవంతులకే కాపలాదారులు, రైతులకు కాదు..’’ అని ఆవిడ వ్యాఖ్యానించారు. ‘గంగా యాత్ర‌’ పేరుతో లోక్‌సభ ఎన్నికల కోసం వినూత్న ప్రచారం చేపట్టిన ప్రియాంక గాంధీ... ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు, యువకులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారనీ.. దీని వల్లే ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొందని పేర్కొన్నారు.
 
కొందరు రాజకీయ జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారనీ.. అందుకే ప్రజలు తమ ఇబ్బందులను తనతోనూ, తమతోటి కాంగ్రెస్ నాయకులతోనూ పంచుకుంటున్నారని ప్రియాంక చెప్పుకొచ్చారు. కాగా ఉత్తర ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల విద్యార్ధులతో ప్రియాంక గాంధీ ‘‘బోట్ పే చర్చ’’ (పడవలో చర్చ) చేపట్టనున్నారు. ఈ నెల 21న ఆవిడ ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకుని, అక్కడ జరిగే హోలీ సంబరాల్లో ప్రియాంక పాల్గొనున్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అపుడు 'అన్నయ్య'.. ఇపుడు 'తమ్ముడు'... జనసేన కూడా మరో ప్రజారాజ్యమేనా?