Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రొమో వీడియోలో మోడీని కూడా వదల్లేదు...

Advertiesment
'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రొమో వీడియోలో మోడీని కూడా వదల్లేదు...
, మంగళవారం, 12 మార్చి 2019 (15:35 IST)
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్''. ఈ చిత్రంలో ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం మిగిలిపోయిన షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవితంలో ఎన్టీఆర్‌గా ప్రమఖ రంగస్థల నటుడు విజయ్‌ కుమార్‌ నటిస్తున్నారు. అలాగే, లక్ష్మీపార్వతిగా యజ్ఞాశెట్టి కనిపించనుంది. 
 
కల్యాణీ మాలిక్‌ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 22వ తేదీ విడుదలకు సిద్ధం అవుతుండగా సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా  జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రచార చిత్రాలను, ట్రైలర్‌లను విడుదల చేసిన వర్మ.. ప్రమోషన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో ప్రోమోను దర్శకుడు వర్మ విడుదల చేశాడు. 
 
'ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబు తనను ఎలా వెన్నుపోటు పొడిచారో చెప్పాడు' అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం ఆధారంగా అప్పటి ఎన్టీఆర్ వ్యాఖ్యలను వీడియో రూపంలో తయారు చేసి రాంగోపాల్ వర్మ విడుదల చేశారు.
 
'చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది నాకు కాదు.. నాకు అధికారం ఇచ్చిన మీకు' అంటూ ప్రజలతో ఎన్టీఆర్ తన ఆవేదనను పంచుకున్న వీడియోని రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. 'ప్రజాస్వామ్యం బాగుండాలంటే ఎవరికి ఓటేయాలి' అనే విషయాన్ని ఎన్టీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారని వర్మ తన వీడియోలో ఎన్టీఆర్ సందేశంగా వినిపించారు. 
 
అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబును ఉద్దేశించి 'నువ్వే మామకు వెన్నుపోటు పొడవటంలో సీనియర్' అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రోమోలో ఉంచారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిజం చెప్తే.. వారి పరువు పోతుంది... ప్రియా ప్రకాష్ వారియర్