Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ముత్తువేల్... ' అని అనగానే.. భావోద్వేగానికి గురైన దుర్గాస్టాలిన్

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (10:31 IST)
తమిళనాడు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని ఆ రాష్ట్ర రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్‌తో పాటు ఆయన మంత్రివర్గ సభ్యులతో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, ఈ ప్రమాణ స్వీకారోత్సవ ఘట్టంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది.
 
తన భర్త ఎంకే.స్టాలిన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే స్టాలిన్ భార్య దుర్గా స్టాలిన్ భావోద్వేగానికి గురయ్యారు. ఉబికివస్తున్న కన్నీటిని పంటిబిగువున అదిమిపట్టుకున్నారు. అప్పటికీ... అపుకోలేకపోయారు. స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేస్తూ... ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అని అనగానే ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో తన తల్లిపక్కనే ఉన్న కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.
 
అయితే, దుర్గా స్టాలిన్ భావోద్వేగానికి లోనుకావడంలో తప్పులేదు. ఎందుకంటే.. స్టాలిన్‌ - దుర్గాలకు గత 1975లో వివాహమైంది. ఈ వివాహం జరిగిన వెంటనే స్టాలిన్‌ జైలుకెళ్లారు. అప్పటికి దుర్గా స్టాలిన్ కొత్త పెళ్లికుమార్తె. అపుడే అత్తగారింటికి అడుగుపెట్టిన కొత్తల్లో భర్త జైలుకెళ్లడం ఏ వధువు అయినా జీర్ణించుకోలేదు. తట్టుకోలేదు. కానీ, దుర్గా స్టాలిన్ అప్పటి నుంచి ఇప్పటివరకు స్టాలిన్‌ ఎదుర్కొనే ప్రతి కష్టంనష్టంలోనూ వెన్నంటివున్నారు. అందుకే ఆమె తన భర్త రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే భావోద్వేగానికి గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments