Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అనే నేను... తమిళనాడు సీఎంగా..

ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అనే నేను... తమిళనాడు సీఎంగా..
, శుక్రవారం, 7 మే 2021 (10:14 IST)
ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అనే నేను.. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంకే స్టాలిన్‌తో తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత 33 మంది మంత్రులతో గవర్నర్ మంత్రులుగా ప్రమాం స్వీకారం చేయించారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా సింపుల్‌గా కార్యక్రమం జరిగిపోయింది. ఈ కార్యక్రమానికి అతికొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. 
 
కాగా, గత పదేళ్లుగా కష్టనష్టాలకు ఎదురొడ్డి పార్టీని అంటిపెట్టుకునివున్న పార్టీ సీనియర్ నేతలకు స్టాలిన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. అలాగే, తనకు కుడిఎడమలుగా ఉన్న చెన్నైకు చెందిన ఇద్దరు నేతలకు కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. స్టాలిన్ మినహా మొత్తం 33 మందితో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 
 
ఈ మంత్రుల్లో గతంలో డీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రులుగా వ్యవహరించిన వారితోపాటూ యువకులు, కొత్త వారికి స్టాలిన్‌ అవకాశం ఇచ్చారు. సీనియర్ నేతలైన దురైమురుగన్, కెఎన్‌. నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, ఏవీ, వేలు, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, కేకేఎస్‌ఎస్ఆర్‌ రామచంద్రన్, తంగం తెన్నరసు, రఘుపతి, ముత్తుస్వామి, పెరయకుప్పన్, టీఎం. అన్బరసన్, ఎంపీ స్వామినాథన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రాజకణ్ణప్పన్, కె. రామచంద్రన్, చక్రపాణి, వి. సెంథిల్‌ బాలాజీ, ఆర్‌. గాంధీ, ఎం సుబ్రమణియన్, పి. మూర్తి, ఎస్‌ఎస్‌ శివశంకర్, పీకె. శేఖర్‌బాబు, పళనివేల్‌ త్యాగరాజన్, ఎస్‌ఎం. నాజర్, సెంజి కేఎస్‌ మస్తాన్, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, ఎస్‌వీ గణేశన్, మనో తంగరాజ్, మదివేందన్, కయల్‌విళి సెల్వరాజ్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
 
ఇదిలావుంటే, మొత్తం 234 స్థానాలకుగానూ డీఎంకే కూటమి 156 సీట్లను గెల్చుకుని అన్నాడీఎంకే కూటమికి షాక్ ఇచ్చింది. ఇందులో డీఎంకే ఒంటరిగానే 125 సీట్లలో గెలుపొందింది. దీంతో డీఎంకే స్వతంత్రంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు, అన్నాడీఎంకే కూటమికి 78 సీట్లు లభించాయి. దీంతో రాష్ట్రంలో దశాద్దకాలం తర్వాత డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆప్ఘనిస్థాన్‌లో భారీ వరదలు.. 50మంది మృతి