Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుప్రమాదంలో కేంద్ర మంత్రికి తప్పిన ముప్పు.. కాని సతీ వియోగం

Webdunia
మంగళవారం, 12 జనవరి 2021 (11:18 IST)
రక్షణ, ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కేంద్రమంత్రికి తీవ్ర గాయాలవగా, భార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్‌ మరణించినట్లు అధికారులు తెలిపారు.

శ్రీపాద్‌ నాయక్‌ ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా సమీపంలో బోల్తాపడింది. ఎల్లాపూర్‌ నుంచి గోకర్ణ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు.

మెరుగైన వైద్యం కోసం కేంద్రమంత్రిని గోవాలోని బంబోలి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందేలా చూడాలని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ను ప్రధాని మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరారు. అవసరమైతే విమానంలో ఆయనను ఢిల్లీ తరలించాలని సూచించారు. కాగా, సావంత్‌ ఆస్పత్రికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments