Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీ మేయర్ కావాలా? ఎంఐఎం మేయర్ కావాలా?: కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌

Advertiesment
BJP mayor
, ఆదివారం, 22 నవంబరు 2020 (19:35 IST)
టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ చార్జ్‌షీట్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ దీనిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక ఫలితాల్లో ఏం జరిగిందో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లోనూ అదే రిపీట్ కాబోతోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. 
 
హైదరాబాదీలు కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే మతతత్వ ఎంఐఎంకు ఓటు వేసినట్లేనని, ఎంఐఎంకు ఓటు వేస్తే విభజన వాదానికి ఓటు వేసినట్లేనని ఆయన తెలిపారు. బీజేపీ మేయర్ కావాలా.. ఎంఐఎం మేయర్ కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలన్నారు.

హైద్రాబాద్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకోబోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్, ఓవైసీ కుటుంబ పార్టీల నుంచి హైద్రాబాద్‌ను కాపడుకోవాలని హైదరాబాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లే అని అభిప్రాయపడ్డారు.

కేసీఆర్, హరీష్, కేసీఆర్ నియోజకవర్గాలకు మధ్యలో ఉన్న దుబ్బాకను గెలిచామని, దుబ్బాక ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో పునరావృతం కాబోతోందని ధీమా వ్యకం చేశారు.

‘కేసీఆర్ ఆరేళ్ళల్లో పాలన అవినీతికి చిరునామా. హైద్రాబాద్‌ను డల్లాస్ నగరం చేస్తామని.. కేటీఆర్ వరదల‌ నగరంగా మార్చారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం. మోదీ రెండున్నర లక్షల ఇళ్ళు నిర్మిస్తే.. కేసీఆర్ రెండు వందల ఇళ్ళు కూడా నిర్మించలేదు. హుస్సేస్ సాగర్‌లో ఉన్న కొబ్బరినీళ్ళు కేసీఆర్ తాగుతున్నారా?.

కరోనా సమయంలో ప్రజలను గాలికి వదిలి కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేసి ఉంటే పేదలకు కరోనా చికిత్స ఉచితంగా అందేది. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర కీలకం.. సుష్మా స్వరాజ్ లేకోయినా ఆమె పోరాటం మర్చిపోలేం. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో అందరకీ తెలుసు’అని అన్నారు. 
కేసీఆర్, ఓవైసీ లాంటి కుటుంబ పార్టీల నుంచి నగరాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కేవలం అక్బర్, అసదుద్దీన్ కోసమే రాజకీయాలు చేస్తున్నారని, కేసీఆర్ ఆరేళ్ల పాలన అవినీతికి చిరునామా అని మండిపడ్డారు. హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తామని ప్రకటించిన కేసీఆర్ చివరికి వరదల నగరంగా మార్చేశారని ఎద్దేవా చేశారు. 
 
లక్షల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కేంద్రం విడుదల చేసిన నిధులను కేసీఆర్ కుటుంబం దాచుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. 
 
మూసీ నదిని ప్రక్షాళన చేశామని టీఆర్‌ఎస్ సర్కార్ పదేపదే ప్రకటిస్తోందని, కొబ్బరి నీళ్లలాంటి మూసీ నీటిని సీఎం కేసీఆర్ తాగుతారా? అని ప్రశ్నించారు. 
 
ప్రధాని మోదీ రెండున్నర లక్షల ఇళ్లను నిర్మిస్తే కేసీఆర్ రెండు వందల ఇళ్లను కూడా నిర్మించలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను గాలికి వదిలిసి, సీఎం ఫాంహౌజ్‌లో పడుకున్నారని ఆయన విమర్శించారు. 
 
ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేసి ఉంటే పేదలకు కరోనా చికిత్స ఉచితంగా అందేదని, ఈ విషయంలో ఇక్కడి ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణను సాధించడంలో బీజేపీ పాత్ర కీలకమని, సుష్మా స్వరాజ్ లేకపోయినా ఆమె పోరాట స్ఫూర్తిని మాత్రం తెలంగాణ ప్రజానీకం మరిచిపోదని జవదేకర్ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసోం మాజీ సిఎం పరిస్థితి మరింత విషమం!