Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ నగరంలో 67 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు: మంత్రి తలసాని

హైదరాబాద్ నగరంలో 67 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు: మంత్రి తలసాని
, ఆదివారం, 22 నవంబరు 2020 (18:36 IST)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరంలో 67 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ నగర్ కార్పొరేటర్ అభ్యర్థి కుర్మ హేమలత కు మద్దతుగా ఢంకా మోగించి ఇంచార్జి దుర్గం చిన్నయ్యతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో రోడ్లు, ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం, పార్క్ ల అభివృద్ధి,  అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వివరించారు. 

మీరు ఏం చేశారని ఓట్లకు వస్తున్నారో  ప్రజలకు వివరించాలని ప్రతిపక్షాల నేతలను డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న పార్టీలకు ప్రజలు బుద్ధి2చెబుతారని హెచ్చరించారు. అభివృద్ధి కావాలని  ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాలలో గెలిపిస్తారని చెప్పారు.

అనంతరం సనత్ నగర్ డివిజన్ లోని అల్లా ఉద్దీన్ కోఠిలో అభ్యర్థి కొలన్ లక్ష్మీకి మద్దతుగా ఇంచార్జి పురాణం సతీష్, ఆత్రం సక్కు లతో కలిసి. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని, మరింత అభివృద్ధి కోసం కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవం