Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలిపై గురి పెట్టాడు, భార్య బయటకు పోగానే మత్తు మందు కలిపి అత్యాచారం

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (13:42 IST)
భార్యకు సోదరి. చాలా అందంగా ఉంటుంది. అయితే తన భార్యతో బాగా విసిగిపోయిన ఆ వ్యక్తి మరదలిపైనా కన్నేశాడు. ఆమెను ఎలాగోలా లైన్లో పెట్టాలనుకున్నాడు. వరుసకు మరదలే అయినా అక్క భర్త కావడంతో నేను నీ మరదల్ని కాదు... నేను నీ సోదరి లాంటిదన్నని.. నన్ను చెల్లెలుగా చూసుకోవాలి అంటూ పదేపదే ఆమె చెబుతూ వచ్చింది. కానీ ఈ కామాంధుడు మాత్రం అదనుకోసం వేచి చూసాడు.
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ లోని హజారీఘర్ జిల్లాకి చెందిన రామ్ లాల్ అనే వ్యక్తికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. భార్య చెల్లెలు డిగ్రీ పూర్తి చేసేందుకు అక్క ఇంటికి వచ్చింది. పెళ్ళి సమయంలోనే మరదలిపై ఒక కన్నేసిన బావ ఇంటికే మరదలు రావడంతో ఇక ఆమెపైనే గురి పెట్టాడు.
 
ఇద్దరు పిల్లలున్నారనే విషయం మర్చిపోయాడు. ఆమెను శారీరకంగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు చెబుతున్నా వినిపించుకోలేదు. ఆమెకు మరింత దగ్గరవ్వాలని చూశాడు. విషయాన్ని బయటకు చెబితే ఎక్కడ తన వల్ల తన అక్క జీవితం నాశనమైపోతుందేమోనని బయటకు చెప్పకుండా సైలెంట్‌గా ఉండేది ఆ మరదలు.
 
దీన్నే అదునుగా తీసుకుని మరింత రెచ్చిపోయాడు రాంలాల్. ఎలాగూ ఆమె తన కోరిక తీర్చదని నిర్ణయించుకున్నాడు. ఒక రోజు పిల్లలిద్దరితో కలిసి భార్య బయటకు వెళ్ళడం.. రెండు గంటల పాటు రాకపోవడం.. దాంతో పాటు మరదలు జ్వరంతో కాలేజీకి వెళ్ళకుండా ఇంటిలోనే వుండిపోవడంతో అతని పని ఈజీగా మారింది.
 
ఉద్యోగానికి వెళుతున్నానని చెప్పి భార్య అలా వెళ్ళిన తరువాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు. జ్వరంగా ఉంది కదా నీకు పాలు తీసుకువచ్చా.. వేడిగా పాలు తాగు అంటూ అందులో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చాడు. అంతే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. 
 
అలా ఆమె మత్తులోకి జారుకోగానే ఆమెపై తన కామవాంఛను తీర్చుకున్నాడు. మత్తు నుంచి బయట పడిన యువతి తనపై జరిగిన అఘాయిత్యాన్ని పసిగట్టింది. అంతే... తన అక్కకు విషయాన్ని చెప్పగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments