చలికాలం.. గోరు వెచ్చని పాలలో రెండు ఖర్జూరాలు తీసుకుంటే?
, సోమవారం, 11 జనవరి 2021 (22:18 IST)
చలికాలంలో చాలామంది జీవక్రియ సరిగా జరగక ఇబ్బంది పడుతుంటారు. వీళ్లు ఖర్జూరం తింటే మంచిది. వీటిల్లోని పీచుపదార్థాల వల్ల వీరి జీర్ణక్రియ సమస్య తగ్గుతుంది. ఖర్జూరాల్లో ఫ్యాట్స్ తక్కువ. ప్రొటీన్లు ఎక్కువ. అందుకే ఏ సీజన్లలో అయినా శరీరానికి కావలసినంత ఎనర్జీని ఇవి అందిస్తాయి. బ్లడ్ షుగర్ ప్రమాణాలను ఖర్జూరాలు సమతులం చేస్తాయి.
ఖర్జూరాలు ఐరన్ లేమిని పోగొడతాయి. జుట్టు ఊడకుండా సంరక్షిస్తాయి. వీటిని అతిగా తింటే శరీరం బాగా బరువు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకు నాలుగు మించి వీటిని తినకుండా ఉంటే మంచిది. నేచురల్ స్వీట్‌నట్స్ అయిన ఖర్జూరాలను సలాడ్స్, డెజర్టులలో వాడితే మరెంతో రుచిగా ఉంటాయి. రోజూ ఒక గ్లాసుడు గోరువెచ్చటి పాలతో పాటు రెండు ఖర్జూరాలు తింటే బరువు తగ్గుతారు.
తర్వాతి కథనం