Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నెలలుగా జీతాలు లేక ఇడ్లీలు విక్రయిస్తున్న ఇస్రో ఉద్యోగి

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (14:00 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవల ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యపరిచేలా చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అయితే, ఇస్రోలో పని చేసే ఉద్యోగుల్లో కొందరికి గత 18 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో చంద్రయాన్-3‌కి లాంచ్‌పాడ్ తయారు చేసిన సభ్యుల్లో ఒకరైన దీపక్ కుమార్ కుటుంబ పోషణ నిమిత్తం ప్రస్తుతం ఇడ్లీలు విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దీపక్ కుమార్.. గత 2012లో భారత ప్రభుత్వం రంగ సంస్థ హెచ్.ఎస్.ఈ.సీ‍లో టెక్నీషియన్‌గా చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన కుటుంబ పోషణ కోసం రాంచీలోని రోడ్డు పక్కన ఇడ్లీ బండి పెట్టుకుని ఇడ్లీలు విక్రయిస్తున్నాడు. 
 
ఉదయం ఇడ్లీలు అమ్మి ఆఫీసుకు వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చి అదే పనిచేస్తున్నారు. దానికి కారణం 18 నెలలుగా హెచ్ఎస్ఈసీలో ఉద్యోగులకు జీతాలు అందకపోవడమే. మంగళవారం మీడియాతో దీపక్ కుమార్ మాట్లాడుతూ తన దీనస్థితిని వివరించారు. 'తొలుత క్రెడిట్ కార్డు తీసుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. రూ.2 లక్షల అప్పు తీర్చకపోవడంతో తనను డీఫాల్టర్ ప్రకటించారు. 
 
అనంతరం తన భార్య నగలు తాకట్టు పెట్టాను. ఆకలితో చావకూడదని నిశ్చయించుకుని ఇడ్లి బండి పెట్టాను. రోజుకు రూ.300-400 వస్తున్నాయి. పెట్టుబడిపోగా రూ.50-100 మిగులుతున్నాయి. ఈ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అని భావోద్వేగంతో చెప్పారు. స్కూలు ఫీజును చెల్లించకపోవడంతో యాజమాన్యం తన ఇద్దరు కూతుళ్లను అవమానించిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments