Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి బిల్లు చెల్లించలేక నవజాత శిశువును వదిలివేసి వెళ్లిన తల్లిదండ్రులు

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (13:45 IST)
ఓ నవజాత శిశువు చికిత్స కోసం ఒక కార్పొరేట్ ఆస్పత్రి వేసిన బిల్లు చూసి ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆ బిల్లును చెల్లించలేక తమ 13 రోజుల బిడ్డను ఆస్పత్రిలోనే వదిలివేసి వెళ్లిపోయారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సింగరేణి కాలనీ రోడ్డు నంబర్ 14కు చెందిన నితిన్‌ (23), రవళిక (20) అనే వారు గత యేడాది పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దినసరి కూలీలు. వీరికి ఈ నెల ఏడో తేదీన పాప జన్మించింది. ఆ పాపకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అదే రోజు నిలోఫర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వెంటిలేటర్‌ ద్వారా వైద్యం అందించి ఆరోగ్యం కుదుటపడడంతో ఇంటికి పంపించారు. 
 
ఇంటికి వచ్చిన తర్వాత పాప శరీరంలో మార్పు రావడంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యుడిని సంప్రదించారు. వైద్యుడు పరిశీలించి చిన్నారికి మెరుగైన చికిత్స అవసరమని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దాంతో పిసల్‌బండలోని ఓ కార్పొరేట్ దవాఖానాకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వైద్యం అందించారు. 
 
ఆరోగ్యం కుదుట పడటంతో ఐదు రోజుల క్రితం డిశ్చార్జి చేశారు. ఈ చికిత్సకు మొత్తం రూ.1.16 లక్షలు బిల్లు వేశారు. తమ వద్ద ఉన్న రూ.35 వేలు చెల్లించారు. మిగతా డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో చిన్నారిని ఆసుపత్రిలోనే వదిలేసి వచ్చారు. మంగళవారం విలేకరుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments