Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరపురాని సింపోజియంను సృష్టించిన టెడ్ ఎక్స్ హైదరాబాద్ 2023 9వ ఎడిషన్ “ఇగ్నైట్”

Advertiesment
image
, సోమవారం, 18 సెప్టెంబరు 2023 (21:35 IST)
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ వార్షిక కార్యక్రమం యొక్క 9వ ఎడిషన్‌ను TEDxహైదరాబాద్ నేడు నిర్వహించింది. గచ్చిబౌలిలోని ప్రధాన్ కన్వెన్షన్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 1200 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమం విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులను ఒకచోట చేర్చడమే కాదు మార్పును రేకెత్తించే ఆలోచన కలిగిన, వినూత్న అనుభవాలతో కూడిన వ్యక్తులలోని శక్తిని ప్రేరేపించింది. 
 
'ఇగ్నైట్' అనే నేపథ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వక్తలు స్ఫూర్తిదాయక ప్రసంగాలను చేశారు. ఈ అసాధారణ వక్తలు తమ దయ, మానవత్వం, ఆవిష్కరణ, కష్టాలను ఎదుర్కొనే నైపుణ్యం యొక్క కథలతో ప్రేక్షకులను కదిలించారు. TEDx హైదరాబాద్ యొక్క 9వ ఎడిషన్ కేవలం ఒక సమావేశం మాత్రమే కాదు; జీవిత సవాళ్లను అధిగమించి ఎదగడానికి సాహసించే వారి అలుపెరగని స్ఫూర్తికి నిదర్శనం.
 
"తమ 9వ ఎడిషన్‌లో, గ్లోబల్ కమ్యూనిటీలో స్ఫూర్తిని రగిలించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. మేము 13 మంది అసాధారణమైన స్పీకర్‌లను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాము, ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత అనుభవాలు మరియు ప్రయాణాల నుండి తీసుకోబడిన కథనాలతో 'ఇగ్నైట్' థీమ్‌పై ప్రత్యేకమైన దృక్పథాన్ని అందించారు. రోజంతా జరిగిన సమావేశంలో విస్తృతమైన నెట్‌వర్కింగ్ మరియు ఎంగేజ్‌మెంట్ అవకాశాలను అందించాము. మా ప్రియమైన హైదరాబాద్ నగరం కోసం ఒక సమయంలో ఒక ఆలోచనతో కూడిన TED సూత్రాలు- థింకర్స్, ఎనేబుల్స్ మరియు డూయర్‌లను కలిగి ఉండే కమ్యూనిటీని పెంపొందించడంలో గొప్పగా గర్వపడుతున్నాము" అని TEDxహైదరాబాద్ క్యూరేటర్ మరియు లైసెన్సీ వివేక్ వర్మ తెలిపారు. 
 
ఈ సింపోజియంలో సస్టైనబిలిటీ ఛాంపియన్ కల్పనా రమేష్ మాట్లాడుతూ, “ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచే నీటి భద్రత కార్యాచరణను ఏర్పాటు చేయడమే తన ప్రయత్నమన్నారు. నెఫ్రో ప్లస్ ఫౌండర్ కమల్ షా మాట్లాడుతూ మనం ఏమైనా చేయగలవు అనే దానికి నిదర్శనమైన తన జీవిత గాథ వెల్లడించారు.
 
ఈ కార్యక్రమంలో స్కైరూట్ ఏరోస్పేస్ సహ-వ్యవస్థాపకుడు మరియు సీఈఓ పవన్ కుమార్, "పల్లె సృజన" మిషన్‌ వ్యవస్థాపకులు బ్రిగేడియర్ పి.గణేశం, 3D అంధ కళాకారిణి మరియు చిత్రనిర్మాత, ఐశ్వర్య పిళ్లై, ఫిలిపినో బ్రిటీష్ కళాకారుడు కాట్ అలానో, ఫెమినిస్ట్ సురభి యాదవ్, రచయిత్రి శ్రీమోయీ కుందు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు మాలావత్ పూర్ణ, కళాత్మక మేధావి థామ్సన్ ఆండ్రూస్, విద్యావేత్త బాబర్ అలీ, మాజీ ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య, గూంజ్ వ్యవస్థాపకులు అన్షు గుప్తా మాట్లాడారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు: కారులోనే పచ్చి బఠానీల కాయల్ని గిల్లుకున్న మహిళ, xలో పోస్ట్