Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజస్థాన్ రాష్ట్రంలో వితంతువుకు మత్తు ఇచ్చి సామూహిక అత్యాచారం

Advertiesment
crime
, బుధవారం, 20 సెప్టెంబరు 2023 (12:07 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ వితంతువుపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆరుగురు కామాంధులు ఏకంగా 14 రోజుల పాటు ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రాజస్థాన్‌లోని పహాడీ సబ్‌ డివిజను పరిధిలో ఓ మహిళ భర్తను కోల్పోయి తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఉద్యోగం ఆశ చూపి ఓ వ్యక్తి చేరువయ్యాడు. తన ఐదుగురు స్నేహితులతో కలిసి కుట్ర పన్నిన ఆ వ్యక్తి.. ఆమెకు శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి భరత్‌పుర్‌లోని ఓ హోటలుకు తీసుకువెళ్లాడు. 
 
ఆమెను అక్కడే 14 రోజుల పాటు నిర్బంధించి ఆరుగురు కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు కామా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మే 5న నీట్ ప్రవేశ పరీక్ష - జేఈఈ మెయిన్ పరీక్ష ఎపుడంటే...