Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోనే మాస్కులు చేసుకోవచ్చు

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (09:43 IST)
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కుల కోసం దుకాణాలకు పరుగులు పెట్టాల్సిన పని లేదంటోంది ఏపీ ప్రభుత్వం. వాటిని ఇంట్లోనే చేసుకోవచ్చని సలహాలు ఇస్తోంది. సురక్షితమైన మాస్కులను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు కరోనా ప్రత్యేక అధికారి ఆర్జా శ్రీకాంత్‌ ప్రకటన విడుదల చేశారు.

ఇంట్లో వినియోగించే సాధారణ వస్తువులతో తయారు చేసిన మాస్కులపై శాస్త్రవేత్తలు పరిశోధించారని, వందశాతం కాటన్‌తో తయారు చేసిన మాస్కులు సూక్ష్మ కణాలను నిరోధించడంలో సర్జికల్‌ మాస్కులకు ధీటుగా 70 శాతం వరకూ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించారని తెలిపారు.

ఇవి శ్వాస తీసుకోవడానికి అనువుగా ఉండడంతోపాటు సులభంగా వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. సర్జికల్‌ మాస్కులు వాడటం వల్ల అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న వారికి అందుబాటులో లేకుండా పోతున్నాయని తెలిపారు.

పైగా అవి కొంతసమయం మాత్రమే ఉపయోగపడతాయని, ఇంట్లో తయారు చేసుకునే మాస్కులు ఉతికి మళ్లీ మళ్లీ వాడుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ దిశగా ఇళ్లలోనే మాస్కులను తయారు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments