Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తమ ఐపీఎస్‌ల జాబితాలో తెలంగాణ డీజీపీ

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (09:36 IST)
తెలంగాణ డీజీపీకి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని అత్యుత్తమ ఐపీఎస్‌ అధికారుల జాబితాలో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డికి చోటు లభించింది.

4 వేల మందిలో చివరికి ఎంపిక చేసిన 25 మందిలో డీజీపీ స్థానం పొందారు. ఫేమ్‌ ఇండియా, ఏసియా పోస్ట్‌, పీఎస్‌యూ వాచ్‌ సంస్థలు నిర్వహించిన సర్వేలో భాగంగా తొలుత దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 4వేల మంది ఐపీఎస్‌లను గుర్తించారు. వారిలో ఉత్తమ పనితీరును కనబర్చిన 200 మందిని వడబోసి చివరగా 25 మందిని ఎంపిక చేశారు.

నక్సలిజం, ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల్ని సమర్థంగా అణిచివేయడం అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నారు. నేరాల్ని నియంత్రించడంలో సామర్థ్యం, శాంతిభద్రతల్ని కాపాడటంలో పనితీరు, ప్రజామిత్ర పోలీసింగ్‌, సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో నేర్పు లాంటి అంశాలకు పెద్దపీట వేసినట్లు పీఎస్‌యూ వాచ్‌ సంస్థ సంచాలకుడు వివేక్‌శుక్లా తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments