Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ భార్యతో బలవంతపు శృంగారం(రేప్)లో పాల్గొన్నా తప్పులేదు

దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పునిచ్చింది. మైనర్ భార్యతో బలవంతపు శృంగారం (రేప్) చేసినా ఎలాంటి తప్పులేదని స్పష్టంచేసింది. అయితే మైనర్ బాలిక వయసు 15 యేళ్లలోపు ఉంటే మాత్రం ఆమె శృంగారానికి అంగీ

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (09:49 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పునిచ్చింది. మైనర్ భార్యతో బలవంతపు శృంగారం (రేప్) చేసినా ఎలాంటి తప్పులేదని స్పష్టంచేసింది. అయితే మైనర్ బాలిక వయసు 15 యేళ్లలోపు ఉంటే మాత్రం ఆమె శృంగారానికి అంగీకరించినా.. అంగీకరించకపోయినా నేరంగానే పరిగణించాలని పేర్కొంది. 15 యేళ్ళ నుంచి 18 యేళ్ళలోపు మైనర్ భార్యల విషయంలో మాత్రం ఇది తప్పుకాదని తెలిపింది.
 
"భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 375లో రెండో క్లాజు ప్రకారం 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న భార్యతో భర్త జరిపే శృంగారం అత్యాచారం కిందికి రాదు"అనే క్లాజును సవాల్‌ చేస్తూ ‘ఇండిపెండెంట్‌ థాట్‌’ అనే స్వచ్ఛంద సంస్థ 2013లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ క్లాజు రాజ్యాంగ విరుద్ధమని.. అది రాజ్యాంగం దేశ పౌరులందరికీ ప్రసాదించిన సమానత్వ, గౌరవంగా జీవించే హక్కులకు విఘాతం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. 
 
18 యేళ్లలోపు మహిళలతో వారి అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా అది రేప్‌ కిందకే వస్తుందని.. అలాంటిది ‘వివాహం’ అనే ఒక్క కారణంతో అది రేప్‌ కాకుండా పోదని ఆ సంస్థ వాదన. వివాహం అయిందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా.. శృంగారానికి సమ్మతి ఇవ్వదగ్గ వయసును 18 ఏళ్లుగా నిర్ధారించాలని, ఆలోపు వయసున్న అమ్మాయిలతో భర్తే శృంగారంలో పాల్గొన్నా రేప్‌గానే పరిగణించాలని ఆ సంస్థ కోరింది.
 
దీనిపై జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం విచారణ జరిపి కీలకమైన సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం 15 ఏళ్లలోపు అమ్మాయిలతో సమ్మతితో శృంగారంలో పాల్గొన్నా అది రేప్‌ కిందకే వస్తుందని, 15-18 ఏళ్లలోపు వివాహితల సమ్మతితో వారి వారి భర్తలు శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందికి రాదని స్పష్టంచేసింది. 
 
మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించలేమని పేర్కొంది. భారత శిక్షా స్మృతి 375 ప్రకారం.. భార్య వయసు 15 ఏళ్ల లోపు ఉంటే కనుక ఆమె అంగీకరించినా, లేకపోయినా ఆమెతో శృంగారం నేరం అవుతుందని, కానీ ఆమె వయసు 15-18 ఏళ్ల మధ్య ఉంటే మాత్రం అప్పుడు ఆమె అంగీకారంతో పనిలేకుండా శృంగారంలో పాల్గొన్నా దానిని నేరంగా పరిగణించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

రోషన్ కనకాల చిత్రం మోగ్లీ 2025 ప్రారంభం

Ram Gopal Varma : తెలంగాణ పోలీసులు స్వర్గానికి వెళ్లి శ్రీదేవిని అరెస్టు చేస్తారా?

ఆర్.ఆర్.ఆర్.కు ముందే రామ్ చరణ్ తో సినిమా నిర్ణయం తీసుకున్నా : డైరెక్టర్ శంకర్

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం