Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యక్తిగత సమాచారాన్ని వేటికి వాడుతున్నారో తెలియకపోవడం ఆందోళనకరం: సుప్రీంకోర్టు

భారత్‌లో ప్రైవసీ పదాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉందని, సుమారు 140 కోట్ల మంది సమాచారం ప్రజాక్షేత్రంలో ఉందని సుప్రీం కోర్టు బెంచ్‌ పేర్కొంది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించినట్లయితే , దాని కిందికి ఏమేం వస్తాయో కూడా తామే చెప్పాల్సి ఉందని వెల్లడ

వ్యక్తిగత సమాచారాన్ని వేటికి వాడుతున్నారో తెలియకపోవడం ఆందోళనకరం: సుప్రీంకోర్టు
హైదరాబాద్ , గురువారం, 3 ఆగస్టు 2017 (07:12 IST)
భారత్‌లో ప్రైవసీ పదాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉందని, సుమారు 140 కోట్ల మంది సమాచారం ప్రజాక్షేత్రంలో ఉందని సుప్రీం కోర్టు బెంచ్‌ పేర్కొంది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించినట్లయితే , దాని కిందికి ఏమేం వస్తాయో కూడా తామే చెప్పాల్సి ఉందని వెల్లడించింది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలా లేదా అన్న అంశంపై మూడు వారాలు విచారణ జరిపిన సర్వోన్నత ధర్మాసనం బుధవారం తన తీర్పును రిజర్వులో ఉంచింది. వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుండటం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 
 
మన జీవితం ప్రతి అంగుళంలోకి చొచ్చుకొచ్చిన సాంకేతికత కారణంగా గోప్యత అనే భావన ప్రాభవం కోల్పోతోందని, గోప్యత మౌలిక లక్షణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంచ్‌ అభిప్రాయపడింది. ‘ప్రైవసీ పరిరక్షణ అనే విఫల యుద్ధాన్ని చేస్తున్నాం. వ్యక్తిగత సమాచారాన్ని వేటికి వాడుతున్నారో తెలియడం లేదు. ఇది ఆందోళన కలిగించే విషయం’ అని వ్యాఖ్యానించింది. నేటి సాంకేతిక యుగంలో గోప్యత అనే భావనను పరిరక్షించడం కష్టసాధ్యమవుతోందని పేర్కొంది. గోప్యత పరిరక్షణ ఒక విఫల యుద్ధమని అభివర్ణించింది. 
 
కనీస వ్యక్తిగత విషయాలు వెల్లడించడాన్ని గోప్యత హక్కు కింద పరిగణించరాదని గుజరాత్‌ ప్రభుత్వం సుప్రీంకు నివేదించింది.  నేటి సాంకేతిక యుగంలో పారదర్శకత కీలకమని పేర్కొంది. గోప్యతకు చెందిన పలు అంశాలు ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉన్నాయంది. అత్యున్నత న్యాయస్థానాలు సాంకేతికతతో ముందుకు సాగుతూ నిబంధనల పేరిట వ్యక్తిగత సమాచారాన్ని కోరుతున్నాయని గుజరాత్ ప్రభుత్వ లాయర్లు అన్నారు. గోప్యత హక్కును ఇతర ప్రాథమిక హక్కుల్లో భాగంగా చేర్చితే అభ్యంతరమేమీ లేదని, దాన్ని ప్రత్యేక ప్రాథమిక హక్కుగా ప్రకటించొద్దని విజ్ఞప్తి చేశారు. హరియాణా ప్రభుత్వ లాయర్లు కూడా గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించరాదని కోర్టుకు విన్నవించారు.
 
ఈ బెంచ్‌కు నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 27న లేదా అంతకు ముందు తీర్పును ప్రకటించొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిగురిస్తున్న 'జలాశ'లు.. జూరాలవైపు కృష్ణమ్మ పరుగులు