పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు రంగు పడింది... పదవి ఊడుతోంది... ఎందుకు?
పాకిస్తాన్ దేశ ప్రధానులు పదవిలో వుండగానే ఏదో ఒక ఉపద్రవం ముంచుకొచ్చి వారి పదవి వూడుతుంది. ఉపద్రవం అంటే... వారిపై ఆరోపణలు రావడమో, లేదంటే అంతర్యుద్ధం జరగడమో వంటివన్నమాట. ఇప్పుడు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పైన అక్కడి అత్యున్నత న్యాయస్థానం వేటు వేసిం
పాకిస్తాన్ దేశ ప్రధానులు పదవిలో వుండగానే ఏదో ఒక ఉపద్రవం ముంచుకొచ్చి వారి పదవి వూడుతుంది. ఉపద్రవం అంటే... వారిపై ఆరోపణలు రావడమో, లేదంటే అంతర్యుద్ధం జరగడమో వంటివన్నమాట. ఇప్పుడు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పైన అక్కడి అత్యున్నత న్యాయస్థానం వేటు వేసింది. పనామా లీక్స్ కేసులో ఆయన ప్రమేయం వున్నదని తేల్చింది. ఈ కారణంగా ఆయన ప్రధాని పదవిలో కొనసాగేందుకు అనర్హుడని స్పష్టం చేసింది.
మనీ లాండరింగ్, విదేశాల్లో ఆస్తులను పెంచుకోవడం తదితర ఆరోపణలు నవాజ్ పైన వచ్చిన నేపధ్యంలో అతడిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించింది. ఆరు వారాల్లోగా నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో తమకు నివేదిక ఇవ్వాలని చెప్పిన కోర్టు, నవాజ్ షరీఫ్ పాత్రపైన మరింత లోతుగా దర్యాప్తు చేయాలని, నివేదికలు అందించాలని తెలిపింది. దీనితో నవాజ్ షరీఫ్ ప్రధాని పదవి నుంచి వైదొలగాల్సి వస్తోంది. ఐతే ఇప్పటికే తన పదవి వూడుతుందని నిర్ణయానికి వచ్చిన షరీఫ్ తన బంధువుని ఆ పదవిపై కూర్చోబెట్టేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.