Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకుపై స్టంట్స్... మందలిచిన వ్యక్తిని 28 సార్లు కత్తితో పొడిచి చంపేసిన కిరాతకులు

Webdunia
బుధవారం, 15 జులై 2020 (12:17 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. కొందరు కిరాతకులు ఓ వ్యక్తిని 28 సార్లు కత్తితో పొడిచి చంపేశారు. బైకుపై స్టంట్స్ చేస్తున్న వారిని మందలించడమే ఆ వ్యక్తి చేసిన నేరం. వెస్ట్ ఢిల్లీలోని రఘుబీర్ నగర్‌లో ఈ దారుణం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమ ఢిల్లీలోని రఘుబీర్ నగర్‌కు చెందిన ముగ్గురు కుర్రాళ్లు బైక్‌లపై స్టంట్స్ చేస్తున్నారు. దీన్ని గమనించిన ఓ స్థానికుడు ఆ కుర్రాళ్లను అడ్డగించి, తమ ఏరియాలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దని హెచ్చరించాడు. 
 
అంతే ఆ కుర్రాళ్లకు కోపం వచ్చేసింది. అతనిపై దాడికి తెగబడి కత్తితో 28సార్లు పొడిచేశారు. ఫలితంగా ఆ వ్యక్తి అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. తర్వాత బైక్ స్టంట్స్‌కు పాల్పడటమే కాకుండా, ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments